మేడారం జాతరకు రండి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రుల ఆహ్వానం
సీఎంను కలిసిన సీతక్క, సురేఖ, పొంగులేటి, అడ్లూరి..
అసెంబ్లీ ఛాంబర్‌లో ఆహ్వాన పత్రిక అందజేత
ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలకూ సీఎంకు ఆహ్వానం
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఈనెల 28 నుంచి ప్రారంభమవుతున్న అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఆధ్యాత్మిక వేడుక మేడారం శ్రీసమ్మక్క-సారలమ్మ మహాజాతరకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జిల్లా మంత్రులు ఆహ్వానించారు. ఈమేరకు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మేడారం ఆలయ పూజారులతో కలిసి అసెంబ్లీ ఛాంబర్‌లో సోమవారం సీఎంను కలిసి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర పోస్టర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అదేవిధంగా ఐనవోలు మల్లికార్జునస్వామి వారి బ్రహ్మోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆలయ పూజారులు ఆహ్వానించారు. మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వచనం అందించారు.



