మున్నూరుకాపు పరపతి సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
200 మందికి షుగర్, బీపీ, కంటి పరీక్షలు
పద్మాక్షి రోడ్ కాపు భవనంలో నిర్వహణ
కేర్ డయాబెటిస్ – మ్యాక్స్ విజన్ సంయుక్తంగా సేవలు
కాకతీయ, వరంగల్ సిటీ : మున్నూరుకాపు పరపతి సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు వరంగల్ నగరంలోని పద్మాక్షి రోడ్ కాపు భవన్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కేర్ డయాబెటిస్ సెంటర్, మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ల సంయుక్త సహకారంతో ఈ వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో ప్రజలకు ఉచితంగా షుగర్ పరీక్షలు, బీపీ పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై పరీక్షలు చేయించుకున్నారు. దాదాపు 200 మంది వరకు ఈ ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు.
ఈ వైద్య శిబిరానికి 10వ డివిజన్ కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని, ఆరోగ్యంపై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని నిర్వాహకులను అభినందించారు.
మున్నూరుకాపు పరపతి సంఘం అధ్యక్షుడు తోట ప్రకాష్, కార్యదర్శి కనుకుంట్ల రవికుమార్, నాయకులు బండారు మహేందర్, పోలు లక్ష్మణ్, అశోక్, కార్యవర్గ సభ్యులు తోట శ్రీనివాస్, పూజారి సత్యనారాయణ, తోట వినయ్, శోభన, బోయిన కుమార్ తదితరులు శిబిరం నిర్వహణలో చురుగ్గా పాల్గొన్నారు.
కేర్ డయాబెటిస్ సెంటర్ నిర్వాహకులు గండిగం శివ, నిమ్మకంటి కిషోర్, మ్యాక్స్ విజన్ నిర్వాహకులు శివరాత్రి అశోక్, సిపెల్లి వినయ్ కుమార్, ఎడ్ల రాజు వైద్య పరీక్షలను నిర్వహించి అవసరమైన సూచనలు అందించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు తరచుగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.


