ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్టియు కృషి
పీఆర్టియు టీఎస్ అధ్యక్షుడు పూర్ణచందర్
కాకతీయ, నర్సింహులపేట : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో పీఆర్టియు టీఎస్ ముందుంటుందని ఆ సంఘం మండల అధ్యక్షుడు ఎర్ర పూర్ణచందర్ స్పష్టం చేశారు. సోమవారం నర్సింహులపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఆర్టియు టీఎస్ నూతన క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్లను మండల విద్యాశాఖ అధికారి రామ్మోహన్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పూర్ణచందర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు రావలసిన బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకు పీఆర్టియు టీఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కొండ సంజీవ, వెంకటయ్య, శ్రీనివాస్ రెడ్డి, వీరేందర్, నగేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.


