మడికొండ పద్మశాలి పరపతి సంఘం అధ్యక్షుడిగా సత్యనారాయణ
కాకతీయ, కాజీపేట : పద్మశాలి పరపతి సంఘం మడికొండలో ఆదివారం (04-01-2026) నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో శ్రీ తాటిపాముల సత్యనారాయణ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా శ్రీ నల్ల హేమంత్, ప్రధాన కార్యదర్శిగా శ్రీ కోమాకుల సమ్మయ్య, సహాయ కార్యదర్శిగా శ్రీ గుర్రపు జగదీశ్వర్, కోశాధికారిగా శ్రీ పొట్లబత్తిని లక్ష్మణ్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు సంఘ సభ్యులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పద్మశాలి సమాజ అభివృద్ధి, సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలని నూతన కార్యవర్గాన్ని పలువురు కోరారు.


