చిన్నమప్పారం పాలక మండలికి సన్మానం
కాకతీయ,ఇనుగుర్తి: మండలంలోని చిన్నముప్పారం గ్రామానికి కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచి రాయలి భవాని శేఖర్, ఉపసర్పంచి మల్లంపెద్ద ఐలయ్య తోపాటు పాలకవర్గాన్ని చాకలి ఐలమ్మ యువజన సంఘం ఆధ్వర్యంలో పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు చినురి మధు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు.భవిష్యత్తులో తాము నిర్వహించే స్వచ్ఛంద కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని కోరారు.కార్యక్రమంలోవార్డుమెంబర్లు తాడబోయిన లింగయ్య,కాలేరు రమేష్,ఐలమ్మ, యువజన సంఘ ధ్యక్షులు చీనూరిరాజు,కార్యదర్శి కర్పూరపు నవీన్,కోశాధికారి నెరేళ్ల రాజు,సభ్యులు ముంజంపల్లి శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


