భద్రకాళిని దర్శించుకున్న సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పట్టాభిరామారావు
పూర్ణకుంభ స్వాగతంతో పలికిన ఆలయ అధికారులు
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని హైదరాబాదు నాంపల్లి సిబిఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జ్ డా. పట్టాభిరామారావు ఆదివారం సాయంత్రం కుటుంబ సమేతంగా సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన జడ్జ్ పట్టాభిరామారావుకు దేవాలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభం, మంగళవాద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేసి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. పూజానంతరం దేవాలయ ఈఓ రామల సునీత అమ్మవారి శేషవస్త్రాలను జడ్జ్ పట్టాభిరామారావుకు బహూకరించి మహదాశీర్వచనం నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో హనుమకొండ సీనియర్ సివిల్ జడ్జ్ రామలింగం, దేవాలయ ధర్మకర్త తానుపునూరి వీరన్నతో పాటు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


