ఓటర్ల తారుమారుకు బీజేపీ, కాంగ్రెస్ నేతలే కారకులు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత పదేళ్లుగా జరిగిన ఓటర్ల తారుమారుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చెందిన కొంతమంది మాజీ కార్పొరేటర్ల ప్రోద్బలమే కారణమని మారుతి నగర్ 36వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంతి గోపి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అయితే ఓటమి భయంతో కొందరు బీజేపీ, బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్లు గ్రామీణ ప్రాంతాల నుంచి తమ అనుకూల వ్యక్తులను నగర ఓటర్లుగా చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారని, బలమైన ప్రత్యర్థులు ఉన్న చోట వారి ఓట్లను తొలగించే కుట్రలు సాగుతున్నాయని విమర్శించారు. ఇలాంటి అవకతవకలపై ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్‌ను బాధ్యులుగా చిత్రీకరించడం బీఆర్‌ఎస్ నేతలకు తగదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నిక కూడా పూర్తి పారదర్శకంగా నిర్వహించబడిన విషయాన్ని బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు గుర్తించాలన్నారు.


