కాంగ్రెస్‌తోనే తొర్రూరు అభివృద్ధి!
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోతు హమ్యా నాయక్
కాకతీయ, తొర్రూరు : కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోతు హమ్యా నాయక్ స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ తొర్రూరు పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అధ్యక్షతన ఆదివారం పట్టణంలోని 14వ వార్డులో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హమ్యా నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని, అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు, తెల్ల రేషన్ కార్డులు అందించామని తెలిపారు. రెండో విడతలోనూ మరిన్ని లబ్ధిదారులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో పేదలను ఎంపిక చేసి డబుల్ బెడ్‌రూం ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య, చాపల బాపురెడ్డి, డాక్టర్ పొనుగొటి సోమేశ్వరరావు, మంగళపల్లి రామచంద్రయ్య, జీనుగా సురేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పింగిలి ఉష, ఏఎంసీ డైరెక్టర్లు కందాడి అచ్చిరెడ్డి, కంచర్ల వెంకట చారి, గుండాల నరసయ్య, జలకం శ్రీనివాస్, నర్కూటి గజానంద్, దొంగరి రేవతి శంకర్, బిజ్జాల అనిల్, పనికర రమేష్, కుషాల్, ముద్దసాని సురేష్, వెలుగు మహేశ్వరి, గూడెల్లి రామచంద్రయ్య, అమల, పుట్ట శ్రీలత, మనోహర్, మహేష్ యాదవ్, రమేష్, కుమార్ యాదవ్, నడిగడ్డ మధు తదితరులు పాల్గొన్నారు.


