epaper
Monday, March 2, 2026
epaper

ఏసీబీ వలలో అటవీ రేంజర్

ఏసీబీ వలలో అటవీ రేంజర్
రూ.3.50 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్
కొత్తగూడెం అటవీ విభాగంలో కలకలం
అనుమతులు, ఫైళ్ల క్లియరెన్స్ పేరుతో డిమాండ్
నివాసం, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (టీఎఫ్‌డీసీ) పరిధిలో పనిచేస్తున్న ఓ రేంజర్ స్థాయి అధికారి ఏసీబీ వలలో చిక్కారు. కొత్తగూడెం అటవీ విభాగానికి చెందిన ఈ అధికారి ఓ వ్యక్తి నుంచి రూ.3.50 లక్షల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలోని బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటనతో అటవీ శాఖలో తీవ్ర కలకలం రేగింది. అటవీ అనుమతులు, పనుల మంజూరు, ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్టు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా ముందస్తు ప్రణాళిక రూపొందించిన ఏసీబీ అధికారులు వల పన్ని, నగదు స్వీకరిస్తున్న క్షణంలో దాడి చేసి అధికారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇళ్లూ, కార్యాలయాల్లో తనిఖీలు

పట్టుబడ్డ అధికారి నివాసంతో పాటు కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లంచం నగదును స్వాధీనం చేసుకుని, సంబంధిత ఫైళ్లు, రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరెవరైనా పాల్పడ్డారా అన్న కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టనున్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ప్రకటన ద్వారా వెల్లడికానున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img