ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
కాకతీయ, గణపురం : గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కావటి రజిత రవీందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కావటి రజిత రవీందర్ మాట్లాడుతూ.. మహిళల విద్య కోసం జీవితాంతం పోరాడిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు. అనంతరం సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పొనగంటి మలహాలు రావు, పంచాయతీ కార్యదర్శి ముక్కెర హేమంత్, వార్డు సభ్యులు గండ్రత్ రవీందర్, తీగల శ్రీకాంత్, పొనగంటి మౌనిక, అల్లూరి సారయ్య, కొండి కుమారస్వామి, మాజీ సర్పంచ్ కొత్త పద్మ వెంకటేశ్వర్లు, మాజీ సొసైటీ చైర్మన్ మాధవరావు, ఓనపాక రాజేంద్రప్రసాద్, దుప్పటి ప్రవీణ్, పొనగంటి సతీష్, రూపురెడ్డి రాజిరెడ్డి, నారమల్లె శంకర్, దారకొండ శంకర్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.


