epaper
Monday, March 2, 2026
epaper

ప్రతిమ’ స్టడీ హాల్ ప్రారంభం

ప్రతిమ’ స్టడీ హాల్ ప్రారంభం
నిరుద్యోగ యువతకు ప్రశాంత అధ్యయన వేదిక
ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని వసతులు
ఏడేళ్లలో 300 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు
విద్యార్థులకు నిరంతర సహకారం : మాజీ ఎంపీ వినోద్‌కుమార్

కాకతీయ, కరీంనగర్ : ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తూ కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ‘ప్రతిమ’ స్టడీ హాల్‌ను మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రారంభించారు. ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ హరిణితో కలిసి ప్రతిమ మల్టీప్లెక్స్ రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ స్టడీ హాల్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. తాను కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రశాంతంగా చదువుకునే వసతులు లేవని తన దృష్టికి వచ్చిందన్నారు. ఆ క్రమంలో ప్రతిమ ఫౌండేషన్‌తో చర్చించి, వారి సహకారంతో 2018 జనవరిలో కలెక్టరేట్ రోడ్డులోని కృషి భవన్‌లో అప్పటి జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి ప్రతిమ స్టడీ సెంటర్‌ను ప్రారంభించినట్లు గుర్తు చేశారు.

300 మందికి ఉద్యోగాలు

గత ఏడేళ్లుగా ప్రతిమ ఫౌండేషన్ అన్ని నిర్వహణ ఖర్చులు భరిస్తూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తోందని ప్రశంసించారు. ఈ స్టడీ సెంటర్‌లో చదువుకున్న విద్యార్థుల్లో సుమారు 300 మంది గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, పోలీస్, బ్యాంకింగ్ తదితర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గర్వకారణమని తెలిపారు. కృషి భవన్ పాత భవనం కావడంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పునరుద్ధరణ చేపట్టనున్న నేపథ్యంలో, ఇతర ప్రాంతాల్లో అనువైన స్థలం లభించక ప్రతిమ స్టడీ సెంటర్‌ను ప్రతిమ హోటల్ రెండో అంతస్థుకు తరలించి పునఃప్రారంభం చేసినట్లు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ హరిణి మాట్లాడుతూ.. వినోద్ కుమార్ సూచన మేరకు ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత ఏడేళ్లలో ఈ స్టడీ హాల్ ద్వారా సుమారు 300 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావడం గర్వకారణమన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా అన్ని సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్టడీ సెంటర్ అభివృద్ధికి సేవలందించిన డాక్టర్ హరిణి, డాక్టర్ ప్రతీక్, రాఘవేంద్ర బాబులను వినోద్‌కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో భారాస విద్యార్థి విభాగం నాయకులు జక్కుల నాగరాజు, దూలం సంపత్, శ్రీనాథ్ గౌడ్, విజేందర్ రెడ్డి, సాయి, ఓంకార్, నిఖిల్ రావు, రాజేష్‌తో పాటు భారాస నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి, కంకణాల విజేందర్ రెడ్డి, జక్కుల రాజు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img