ఆలయ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
కాకతీయ, రామకృష్ణాపూర్ : బొక్కల గుట్ట గ్రామంలోని ఋష్య మూక బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ గా కలకుంట్ల రాధాకిషన్ రావు(మాజీ సర్పంచ్),గౌరవ అధ్యక్షులుగా మాసు శ్రీనివాస్ (గ్రామ సర్పంచ్),అధ్యక్షులుగా బలికొండ కిషన్,ఉపాధ్యక్షులుగా పోరెడ్డి అంజన్న,అక్కల రమేష్,ప్రధాన కార్యదర్శిగా కర్ణకంటి రవీంద్ర చారి,కోశాధికారిగా అలుగల సత్తయ్య ఎన్నికయ్యారు. వచ్చే నెల ఫిబ్రవరి 1 న ఋష్య మూక బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు నూతన అధ్యక్షుడు బలికొండ కిషన్ చెప్పారు.


