సావిత్రిబాయి పూలేకు జాగృతి నివాళులు
కాకతీయ, కరీంనగర్ : సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘన నివాళులర్పణ కార్యక్రమం నిర్వహించారు. శాతవాహన యూనివర్సిటీ వద్ద ఉన్న సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి, ఆమె చేసిన సేవలను నేతలు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ.. మహిళల హక్కులు, విద్య కోసం తొలి దశ నుంచే పోరాడిన మహోన్నత నాయకురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు అంకం శివరాణి మాట్లాడుతూ.. మహిళల్లో వచ్చిన చైతన్యానికి మూలకారణం సావిత్రిబాయి పూలేనే అని అన్నారు. ఆమె చేసిన కృషి వల్లనే నేడు మహిళలు ప్రశ్నించే ధైర్యాన్ని సాధించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, గాలిపల్ల రత్నాకర్, యువజన నాయకులు హస్నాబాద్ రాజ్‌కుమార్, జంగ అపర్ణ సాగర్, పోతన రూప, బండ రమేష్ తదితరులు పాల్గొన్నారు


