epaper
Monday, March 2, 2026
epaper

రైతులకు తగిన రుణాలే లక్ష్యం

రైతులకు తగిన రుణాలే లక్ష్యం
సాగు వ్యయాల పెరుగుదలకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్
వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు నగదు పంటలకూ అధిక పరిమితి
రైతుల పెట్టుబడి–ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి
బ్యాంకర్లు సమన్వయంతో ముందుకు రావాలి
క‌రీంన‌గ‌ర్ జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్

కాకతీయ, కరీంనగర్ : రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు తగిన స్థాయిలో రుణాలు అందించాల్సిన అవసరం ఉందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్ స్పష్టం చేశారు. 2026–27 సంవత్సరానికి సంబంధించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారుపై శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో పంటల సాగు వ్యయాలు గణనీయంగా పెరిగాయని, అందువల్ల గత ఏడాదితో పోలిస్తే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను సముచితంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు గోధుమలు, కూరగాయలు, చిరుధాన్యాలు, జొన్న, రాగులు, నగదు పంటలకు అధిక రుణ పరిమితి కల్పించాలని సూచించారు. రైతుల పెట్టుబడి, ఆదాయం, మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలని బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.

రైతుల అభిప్రాయాలు.. సమగ్ర చర్చ

సమావేశంలో రైతులకు రుణాల మంజూరు విధానం, ఫైనాన్సింగ్ ప్రక్రియలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆయా పంటల సాగులో పెట్టుబడులు, ఆదాయం, వ్యయాలపై వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు వివరాలు సమర్పించారు. ఈ సందర్భంగా 20 మంది రైతులు సమావేశంలో పాల్గొని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంపుపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశంలో డీసీసీబీ సీఈఓ సత్యనారాయణ రావు, కరీంనగర్ ఎల్‌డీఎం ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల నాబార్డ్ అధికారులు, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులు, కేడీసీసీబీ అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img