నూగూరు వెంకటాపురం ఎంపీడీవోగా జెమ్మిలాల్
కాకతీయ, నూగూరు వెంకటాపురం : నూగూరు వెంకటాపురం మండలానికి నూతన ఎంపీడీవోగా జెమ్మిలాల్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మండల అభివృద్ధి కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కార్యాలయ సిబ్బంది, ఈజీఎస్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జెమ్మిలాల్ మాట్లాడుతూ మండల అభివృద్ధి పనులకు తన వంతు పూర్తి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందితో సమన్వయంగా పనిచేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.


