మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరేస్తాం
పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలి
బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మల రెడ్డి
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మల రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం హుజురాబాద్‌లోని దర్శిని ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ముదిరాజ్ పట్టణ శాఖ అధ్యక్షుడు తుర్పాటి రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నిర్మల రెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకునే లక్ష్యంతో పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలని, ప్రజల్లో బీజేపీపై విశ్వాసం రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఓటర్ జాబితాపై అభ్యంతరం
మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ జాబితాలో చోటు చేసుకున్న అవకతవకలపై మున్సిపల్ కమిషనర్‌కు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఓటర్ జాబితాను శుద్ధి చేసి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని వారు కోరారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు తుర్పాటి రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు రావుల వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, పట్టణ మాజీ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు, మాజీ కౌన్సిలర్ వెంకటరెడ్డి, నల్ల సుమన్, మెరుగు రాజిరెడ్డి, కేసరి శేషయ్య, మాజీ సర్పంచ్ పోతుల సంజీవ్, పల్లె వీరయ్య, గూడూరి రామిరెడ్డి, జిల్లా నాయకులు, పట్టణ ప్రజాప్రతినిధులు, శక్తి కేంద్ర ఇంచార్జీలు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


