ఘనంగా బెడద వీరన్న జన్మదిన వేడుకలు
కాకతీయ, ఖిలావరంగల్ : వరంగల్ ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కాంటెస్ట్ కార్పొరేటర్ బెడద వీరన్న జన్మదిన వేడుకలు తూర్పుకోట పోచమ్మ ఆలయం వద్ద బాణాసంచా పేలుళ్లతో ఘనంగా నిర్వహించారు. అనంతరం స్థానిక కాంగ్రెస్ నాయకులు కేక్ కటింగ్ చేసి బెడద వీరన్నకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నలిగంటి అభిషేక్, బంగారి శ్రీనివాస్, ఏసిరెడ్డి ప్రభాకర్, సిరాబోయిన గిరి, సుంచు వీరన్న, ఎండీ ముఖబీర్, బోయిని సారంగపాణి, తోట ప్రభాకర్, గోళ్ళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు


