కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే పూర్తి
డీఎంహెచ్ఓ డాక్టర్ తూకారాం రాథోడ్
కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుష్టువ్యాధి గ్రస్తుల గుర్తింపు సర్వే పూర్తయినట్లుగా డిఎంహెచ్ఓ డాక్టర్ తూకారాం రాథోడ్ తెలిపారు. గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 18 నుంచి 31 వరకు జరిగిన ఇంటి ఇంటి సర్వే కార్యక్రమంలో 1436 టిమ్లు పాల్గొని 247693 ఇండ్లను సందర్శించి 8,89,635 మంది వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలించి 1708 మంది కుష్ఠు అనుమానితులుగా గుర్తించడం జరిగిందన్నారు. వీరిని ఈ నెల నుండి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న వైద్యులు ఉప కేంద్రాలలో డీపీఎంఓలు నిర్ధారణ చేయడం జరుగుతుందని తేలియజేశారు. ఇప్పటివరకు వచ్చినటువంటి అనుమానిత కేసులలో నలుగురిని కుష్టు వ్యాధిగ్రస్తులుగా నిర్దారించి ముందులు ఇవ్వడం జరిగిందని చెప్పారు. సమాసమాజంలో ఎవరికైనా శరీరంపై రాగి వర్ణంలో లేదా పాలిపోయిన మచ్చలు ఉండి తిమ్మిరిగా గిచ్చిన నొప్పి లేవకుండా ఉన్నటువంటి మచ్చలుగా గుర్తించినట్లయితే వారు తక్షణమే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి అది కుష్టు వ్యాధియా కాదా అని నిర్ధారించుకోవాలని తెలియజేశారు. వ్యాధి ప్రాథమిక దశలో గుర్తించి మందులు వాడినట్లయితే వ్యాధిని పూర్తిగా నివారించవచ్చును అంగవైకల్యాలకు దారి తీయకుండా చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. సమాజంలో ఇంకాకుష్టు వ్యాధిపై అనుమానాలు అపోహలు కలంకాలు ఉన్నాయి కాబట్టి వ్యాధి సోకిన వారు ఇంకా గోప్యంగా ఉండి సమాజంలో వ్యాధిని వ్యాపింప చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ బి.పుల్లా రెడ్డి, పిజియోతెరపిస్టు జి.భద్రు, మోహన్ డిపియంఓలు తదితరులు పాల్గొన్నారు.


