నూతన సంవత్సర వేడుకలు
కాకతీయ, కరీంనగర్ : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మాజీ మేయర్, బీజేపీ నాయకుడు యాదగిరి సునీల్ రావు క్యాంపు కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సునీల్ రావు అధ్యక్షత వహించారు. క్యాంపు కార్యాలయం సిబ్బంది పాల్గొని నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ నగర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, అభివృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు.


