గోపాల నవీన్ రాజ్ జన్మదిన వేడుకలు
కాకతీయ, ఖిలావరంగల్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గోపాల నవీన్ రాజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ ఎయం సి డైరెక్టర్ సంగరాబోయిన చందర్ ఆధ్వర్యంలో ఖిలావరంగల్‌లోని అనాధ ఆశ్రమంలో అన్నదానం, పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనాధ పిల్లలకు భోజనం అందించి, పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అనాథ పిల్లలను ఉద్దేశించి స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ మాట్లాడుతూ, తూర్పు శాసన సభ్యురాలు, రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావులకు నిత్యం అందుబాటులో ఉంటూ గోపాల నవీన్ రాజ్ ప్రభుత్వ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు వనపర్తి కర్ణాకర్, ఇట్నీని ప్రతాప్, మీడిద్దుల రాణి, మైదం లత, ఎండీ బోలెషా, మేకల కుమార్, గన్నరపు రమేష్, బరిగెల రవీందర్, మీడిద్దుల విష్ణు, గొర్రె దశరథ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆశ్రమ నిర్వాహకులు, కార్యకర్తలు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


