2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్
అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం
ఆక్లాండ్‌లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు
భారీగా క్రాకర్స్ కాల్చి సందడి
వెల్లింగ్టన్/ఆక్లాండ్ : ప్రపంచంలోనే అందరికంటే ముందుగా న్యూజిలాండ్ 2026కు స్వాగతం పలికింది. కివీస్ కొత్త సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానిస్తూ ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. ఆక్లాండ్ నగరం న్యూ ఇయర్ సంబరాలతో వెలుగులీనింది. ఆక్లాండ్‌లోని స్కై టవర్ కేంద్రంగా అర్ధరాత్రి వేళ భారీగా క్రాకర్స్ కాల్చి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. వేలాది మంది స్థానికులు, పర్యాటకులు ఈ వేడుకల్లో పాల్గొని హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలిపారు. నగరమంతా రంగురంగుల కాంతులతో, సంగీత కార్యక్రమాలతో సందడిగా మారింది. ప్రపంచ దేశాలు కొత్త సంవత్సరాన్ని ఒక్కొక్కటిగా ఆహ్వానిస్తున్న తరుణంలో, అందరికంటే ముందుగానే 2026ను ఆహ్వానించిన కివీస్ ఆనందోత్సాహాలు మిన్నంటాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టినట్లు అక్కడి అధికారులు తెలిపారు.


