విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళ్లాలి
అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్: ఆనందోత్సవాల నడుమ అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ముందస్తు 2026 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.నూతన సంవత్సరంలో విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.తల్లిదండ్రులు పిల్లల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించేలా శ్రద్ధ వహించాలన్నారు.2025 సంవత్సరంలో దేశం, రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగిందని పేర్కొన్న ఆయన,విద్యార్థులు అన్ని రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకునేలా ప్రణాళికబద్ధంగా ముందడుగు వేయాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలపై పిల్లలకు అవగాహన కల్పించడం తల్లిదండ్రుల బాధ్యతగా పేర్కొన్నారు.సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులకు వినోదంతో పాటు ఒత్తిడినుంచి ఉపశమనం కలిగిస్తాయని తెలిపారు.దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాహిత కార్యక్రమాలతో రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు


