ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
కాకతీయ,నర్సింహులపేట: ముక్కోటి ఏకాదశి వేడుకలు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, లక్ష్మీనరసింహస్వామి దేవాలయం,శ్రీరాజరాజేశ్వరి నవగ్రహ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయాలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీవెంకటేశ్వర స్వామిని శ్రీ రంగనాథుడిగా ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయ ప్రధాన అర్చకులు నందనాచార్యులు వైదిక మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.ఉత్తరద్వార దర్శనం ద్వారా పుణ్యఫలం దక్కుతుందనే విశ్వాసంతో భక్తులు తెల్లవారుజాము నుండే అధిక సంఖ్యలో హాజరయ్యారు.భక్తిశ్రద్ధలతో ఆలయాలు హో రెత్తాయి.ఈకార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వేముల జైపాల్ రెడ్డి,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పొన్నoశ్రీకాంత్, అనుమాండ్ల వెంకట్ రెడ్డి దంపతులు,అయ్యప్పస్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


