దాడి కేసులో ఐదుగురి అరెస్టు
సీఐ మచ్చ శివకుమార్
కాకతీయ, హనుమకొండ : హనుమకొండ లోని అశోక హోటల్‌లో వ్యాలెట్ పార్కింగ్‌లో పనిచేస్తున్న శ్యామ్ అనే వ్యక్తిపై జరిగిన దాడి కేసులో పోలీసులు వేగంగా స్పందించి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ నెల 23వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో, డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న శ్యామ్‌పై రాగన్న దర్వాజా సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దాడి చేశారు. ఈ ఘటనలో శ్యామ్‌కు తీవ్ర గాయాలు కాగా, వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై శ్యామ్ భార్య మీనా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా 48 గంటల్లోనే నిందితులను గుర్తించిన పోలీసులు, హత్యాయత్నం కేసు కింద ఐదుగురిని అరెస్టు చేసి నేడు రిమాండ్‌కు తరలించారు. అరెస్టయిన నిందితులు.. సంపతి రాహుల్, వర్షిత్, పున్నం చందు, అన్వేష్ రెడ్డి, ప్రణయ్ ఈ కేసులో మరో నిందితుడు అరవింద్ పరారీలో ఉన్నాడని సీఐ మచ్చ శివకుమార్ తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసిన ఎస్సై కిషోర్తో పాటు క్రైమ్ టీమ్ సభ్యులు రావుఫ్, తిరువర్ధన్‌లను సీఐ శివకుమార్ అభినందించారు. పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకోవడంతో బాధితుడికి న్యాయం జరిగే దిశగా కేసు ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.


