ఆర్కేపీ ఎస్సైగా భూమేష్ బాధ్యతలు
కాకతీయ, రామకృష్ణాపూర్ : ఆర్కేపీ పట్టణ నూతన ఎస్సైగా ఎల్.భూమేష్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నూతన ఆంగ్ల సంవత్సరం 2026 వేడుకలను ప్రతి ఒక్కరు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. పోలీస్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పోలీస్ శాఖలో బదిలీలు సహజం
పోలీస్ శాఖలో బదిలీలు సహజమని బదిలీపై వెళ్తున్న ఎస్సై జీ.రాజశేఖర్ అన్నారు. బదిలీపై సి.సి.ఆర్.బీ రామగుండం వెళ్లనున్నట్లు చెప్పారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు.


