రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువుల పంపిణీ
*మండల స్పెషల్ ఆఫీసర్: శ్రీమన్నారాయణ
కాకతీయ,నర్సింహులపేట:ప్రస్తుత రబీసీజన్ సాగుకు అవసరమైన పూర్తి స్థాయి యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని నర్సింహులపేట మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీమన్నారాయణ తెలిపారు.మండల వ్యాప్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా,సాఫీగా ఎరువుల పంపిణీ జరిగేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించామని అన్నారు.అన్ని సహకార సంఘాలు మరియు ఇతర కేంద్రాలలో సరిపడా యూరియా మరియు ఎరువులు అందుబాటులో ఉంచామని,ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం”యూరియా బుకింగ్ యాప్”ను అందుబాటులోకి తెచ్చిందని,రైతులు మరియు డీలర్లు ప్లే స్టోర్ నుండి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.రైతులకు యాప్ వినియోగంలో సహకరించేందుకు పంపిణీ కేంద్రాల వద్ద వ్యవసాయ, సహకార శాఖల సిబ్బంది అందుబాటులో ఉంటారని,ప్రతి కేంద్రంలో యాప్ క్యూఆర్ కోడ్‌ను ప్రదర్శిస్తారని తెలిపారు.
ఈకార్యక్రమంలో ఎంపీడీవో భూక్యా రాధిక,మండల వ్యవసాయ అధికారి వినయ్ కుమార్,ఏఈఓ మౌనిక,బాబు పాల్గొన్నారు


