త్రివిక్రమ్ సినిమాకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్
కాకతీయ, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తర్వాతి సినిమాలపై కన్ఫ్యూజన్ ఉందన్న ప్రచారానికి తెరపడింది. ప్రస్తుతం ఆయన దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ఉండే అవకాశముండగా, 2026 జూన్ 25న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పౌరాణిక చిత్రం చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టమైంది. ప్రస్తుతం త్రివిక్రమ్ వెంకటేష్‌తో సినిమా పూర్తి చేసే పనిలో ఉండగా, ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌కు సిద్ధం కానున్నారు. ఇక దేవర–2 కోసం ఎక్కువ కాలం ఎదురుచూడబోనని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందువల్ల త్రివిక్రమ్ సినిమానే ఆయన తదుపరి ప్రాధాన్యతగా మారింది. ఆ తర్వాత నెల్సన్ దిలీప్‌కుమార్‌తో మరో సినిమా చేయనున్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే దేవర–2 కంటే ముందే ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా ప్రారంభం కానుందన్నది ఖరారైనట్టే అని సినీ వర్గాలు అంటున్నాయి.


