పెద్ది’లో అప్పలసూరిగా జగపతి బాబు
కాకతీయ, సినిమా : రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ నుంచి జగపతి బాబు ఫస్ట్ లుక్ విడుదలైంది. చెదిరిన జుట్టు, ఒత్తైన గడ్డం, విరిగిన కళ్లజోడుతో ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఇందులో ఆయన అప్పలసూరి అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 1989లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు, 2014లో ‘లెజెండ్’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి విలన్, కీలక పాత్రలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ‘శ్రీమంతుడు’, ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించాడు.
‘పెద్ది’ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్‌చరణ్–బుచ్చిబాబు కాంబినేషన్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. అప్పలసూరి పాత్ర జగపతి బాబు కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.


