న్యూఇయర్ నైట్‌కు ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్?
కాకతీయ, సినిమా : సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ప్రీ–ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ప్రత్యేకంగా షూట్ నిర్వహించినట్లు సమాచారం. సినిమా లుక్స్ లీక్ కాకుండా కఠిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ పబ్లిక్ ఈవెంట్స్ తగ్గించనున్నట్లు తెలుస్తోంది. గతంలో విడుదలైన వాయిస్ ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. గతంలో ‘యానిమల్’ ఫస్ట్ లుక్ న్యూఇయర్ నైట్‌లో విడుదలై వైరల్ అయిన నేపథ్యంలో, ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ కూడా డిసెంబర్ 31 రాత్రి విడుదలయ్యే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.


