పారిశుద్ధ్య కార్మికులకు చలి కోట్లు, మంకీ క్యాపులు
28వ డివిజన్‌లో పంపిణీ కార్యక్రమం
కార్పొరేటర్ గందె కల్పన నవీన్ చొరవ
చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని సహాయం
కార్మికుల సేవలకు గౌరవం
కాకతీయ, వరంగల్ సిటీ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్‌లో పారిశుద్ధ్య కార్మికులకు కార్పొరేటర్ గందె కల్పన నవీన్ సోమవారం చలి కోట్లు, మంకీ క్యాపులను పంపిణీ చేశారు. చలికాలంలో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గందె కల్పన నవీన్ మాట్లాడుతూ, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని అన్నారు. వారి కష్టాన్ని గుర్తించి, చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని బల్దియా అందిస్తున్న చలి కోట్లు తో పాటు, తమ సొంత ఖర్చులతో మంకీ క్యాపులను అందజేశామని తెలిపారు.
చలిలోనూ సేవలు
ఎముకలు కొరికే చలిలోనూ పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారని, వారి ఆరోగ్యం, భద్రత పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని కార్పొరేటర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్, జవాన్లు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్మికులు ఈ సహాయానికి కార్పొరేటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


