కాకతీయ ,బయ్యారం: మహబూబాబాద్ జిల్లా గంగారం, ఇల్లందు మండల సరిహద్దులో గల మండలంలో ఏడు బావుల జలపాతాలు ఉన్నాయి . వీటిని చూసేందుకు సందర్శకులకు అనుమతి లేదని, గంగారం రేంజర్ అటవీశాఖ అధికారి మంగీలాల్ ,గంగారం ఎస్సై రవికుమార్ తెలిపారు. సోమవారం ఏడు బావుల జలపాతాల దారి ప్రాంతంలో సందర్శకులకు అనుమతి లేదని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
సందర్శకులు, విహారయాత్రికులు గమనించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విహారం పేరిట విషాదాన్ని చూడవలసి వస్తుందని, ఈ మధ్యకాలంలో ఏడు బావుల జలపాతాలు వీక్షించేందుకు వచ్చి ప్రతి సంవత్సరం ఎవరో ,ఒకరినీ బలిగొంటుందని తెలిపారు,ఈనెల 17 న ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి విహారం పేరిట ఏడు బావుల జలపాతంలో పడి పామర్తి ప్రేమ్ కుమార్ (23) మృతి చెందాడు.
వినోదం పేరిట విహారం లో విషాదం చోటు చేసు కోకూడదని జిల్లా అధికారులు నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు .ఏడుబావుల జలపాతాలను సందర్శకులు, వచ్చేందుకు అనుమతి లేదని తెలిపారు.ఎవరైనా అధికారుల నిబంధనలు అతిక్రమించి జలపాతాలకు వస్తే కఠిన చర్యలు ఉంటాయని, పోలీస్ లు, ఫారెస్ట్ సిబ్బంది నిరంతరం నిఘా పెట్టనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


