అమెరికాలో రోడ్డు ప్రమాదం..
ఇద్దరు తెలుగు యువతులు మృతి
ఉన్నత చదువుల కోసం వెళ్లి మృత్యు ఒడిలోకి..
స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గార్లలో తీవ్ర విషాదం
కాకతీయ, తెలంగాణ బ్యూరో: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పుల్లఖండు మేఘన (24), కడియాల భావన (24) మృత్యువాతపడ్డారు. అమెరికాలో ఉన్నత చదువులు.. ఉద్యోగాల కోసం వెళ్లిన ఈ యువతులు ప్రమాదంలో చిక్కుకున్నారు. ప్రమాద వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. స్థానిక అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ దుర్ఘటన మహబూబాబాద్ జిల్లాలోని వారి కుటుంబాలను తీవ్ర విషాదంలో ముంచింది. స్థానికులు పెద్దఎత్తున మృతుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.


