సిరిసేడు పాఠశాలకు మాతా అండ
రూ.2 లక్షలతో విద్యార్థుల సౌకర్యాలు
మాతా అసోసియేషన్ సౌజన్యం
ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ (మాతా) సౌజన్యంతో విద్యార్థుల సౌకర్యార్థం రూ.2 లక్షల వ్యయంతో నిర్మించిన బాత్రూములను కటంగురి అంజలిదేవి, రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్యామల కుమార్, మండల విద్యాధికారి రాములు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, మాతా అసోసియేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్ధికి అవసరమైన మరిన్ని కార్యక్రమాలకు మాతా అసోసియేషన్ సహకారం అందిస్తుందని తెలిపారు.
పర్యవేక్షణకు ప్రశంసలు
విద్యార్థుల బాత్రూముల నిర్మాణ పనులను శ్రద్ధగా పర్యవేక్షించి పూర్తి చేయించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జగదీశ్వర్, ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగ రామకృష్ణలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్థులు మాతా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కటంగూరి విక్రాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే గ్రామస్థులు బొమ్మెడి తిరుపతి, చింటూ, రాజయ్య, రేణుకుంట్ల రాములు, ఎజ్జు శ్రీను, కార్యదర్శి శ్రీనివాస్, గొట్టే శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


