కాకతీయ, సినిమా డెస్క్: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. అతను త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. తాజాగా రాహుల్ ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో చూద్దాం.
ఆస్కార్ అవార్డు గ్రహిత రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయితో కలిసి కొత్త జీవితం ప్రారంభించనున్నాడు. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. ఆదివారం తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడక ఘనంగా జరిగింది. రాహుల్ కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఈ ఎంగేజ్ మెంట్ గురించి అధికారికంగా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రాహుల్ కు అభినందనలు చెబుతున్నారు.
రాహుల్ సిప్లిగంజ్ చేసుకోబో అమ్మాయి పేరు హరిణిరె్డి. ఆమె గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక నిశ్చితార్థంలో రాహుల్, హరిణీ రెడ్డి కలర్ ఫుల్ డ్రెస్సులో తళుక్కుమన్నారు. రాహుల్ పాస్టెల్ లావెండర్ షేర్వానీలో రాయల్ లుక్ లో కనిపించారు. హరిణి ఆరేంజ్ కలర్ లెహంగా ధరించి అందంగా ముస్తాబు అయ్యింది. మొత్తానికి ఈ జంట చూడముచ్చగా ఉందంటున్నారు ఫ్యాన్స్. రాహుల్ పెళ్లిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


