epaper
Sunday, March 1, 2026
epaper

పెళ్లైన 24 గంటల్లోనే విడాకులు!

పెళ్లైన 24 గంటల్లోనే విడాకులు!
మూడుేళ్ల ప్రేమ.. ఒక్కరోజులో ముగింపు
నివాసం, జీవనశైలిపై తలెత్తిన విభేదాలు
హింస, ఆరోపణలు లేవు.. పరస్పర అంగీకారమే
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటన

కాకతీయ, పుణే : మహారాష్ట్రలోని పుణేలో ఓ నూతన దంపతుల వ్యవహారం పెళ్లి వ్యవస్థపై చర్చకు తెరలేపింది. మూడేళ్ల ప్రేమ తర్వాత పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న జంట.. పెళ్లైన 24 గంటల్లోనే చట్టబద్ధంగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. ఈ ఘటన స్థానికంగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారి తీసింది. వృత్తిరీత్యా యువతి డాక్టర్ కాగా, యువకుడు ఇంజినీర్‌. పెళ్లికి ముందు మూడేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంటకు వివాహానంతరం జీవన విధానం విషయంలో తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ముఖ్యంగా ఎక్కడ నివసించాలి? ఉద్యోగ జీవితం ఎలా కొనసాగాలి? అనే అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విడిపోవడమే సరైన నిర్ణయమని భావించినట్లు తెలుస్తోంది.

పెళ్లి తర్వాతే వెలుగులోకి వచ్చిన నిజం

పెళ్లి అనంతరం యువకుడు తన భార్యకు కీలక విషయాన్ని వెల్లడించాడు. తాను షిప్‌లో పనిచేస్తానని, ఎప్పుడు పోస్టింగ్‌ వస్తుందో, ఎంతకాలం ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుందో చెప్పలేనని వివరించాడు. ఈ అంశం యువతికి ఆమోదయోగ్యంగా లేకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగాయి. ఈ పరిస్థితుల్లో కలిసి జీవించడం కష్టమని భావించి పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ కేసును వాదించిన అడ్వకేట్ రాణి సోనవానే మాట్లాడుతూ.. ఈ జంట మధ్య ఎలాంటి గృహహింస, క్రిమినల్ ఆరోపణలు లేవని స్పష్టం చేశారు. పూర్తిగా చట్టపరమైన ప్రక్రియను అనుసరించి పరస్పర అంగీకారంతో వివాహ బంధాన్ని రద్దు చేసుకున్నారని తెలిపారు. సాధారణంగా భారత్‌లో విడాకుల కేసులు నెలల తరబడి, కొన్నిసార్లు ఏళ్లపాటు కోర్టుల్లో నడుస్తాయని, అయితే ఈ కేసు అత్యంత వేగంగా పరిష్కారం కావడం ఆశ్చర్యకరమన్నారు. పెళ్లి వ్యవస్థలో ముందస్తు అవగాహన, జీవన లక్ష్యాలపై స్పష్టత ఎంత కీలకమో ఈ ఘటన మరోసారి రుజువు చేస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img