epaper
Saturday, November 15, 2025
epaper

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక?
* ఈ నెలాఖరున రామకృష్ణారావు పదవీ విరమణ
* చీఫ్ సెక్రటరీ నియామకంపై ప్రభుత్వo మల్లగుల్లాలు
* రేసులో నలుగురు సీనియర్ అధికారులు!
* 1992 బ్యాచ్ కు చెందిన వారికే ఛాన్స్!
* తెరపైకి అరవింద్ కుమార్, వికాస్ రాజ్, జయష్ రంజన్, సంజయ్ జాజు పేర్లు!
* సర్కార్ నిర్ణయం పై ఉద్యోగ వర్గాల్లోనూ ఉత్కంఠ

కాకతీయ తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో కొత్త సవాల్ ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్కు అత్యంత కీలకమైన పదవిగా భావించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) మార్పు అనివార్యం అయ్యింది. ప్రస్తుత సీఎస్ కే రామకృష్ణారావు పదవీ విరమణ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. దీంతో ఆయన స్థానంలో కొత్త సిఎస్ ఎంపిక చేయాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పడింది. ఈ నియామకం కేవలం ఒక్క అధికారి స్థానంలో మరొకరిని కూర్చోబెట్టడంతో సరిపోదు. రాబోయే మూడేళ్ల పాటు ప్రభుత్వం పాలన దిశను, ప్రాధాన్యతలను నిర్దేశించే కీలక నిర్ణయాలను సిఎస్ తీసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా రాష్ట్ర పాలనను గాడిలో పెట్టడంతో పాటు ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంకట స్థితి నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టు ఎక్కించి, ఆరు గ్యారెంటీలు అమలు కోసం మార్గం సుగమం చేయాల్సిన బాధ్యత కొత్త సిఎస్ పైనే ఉంది దీంతో చీఫ్ సెక్రటరీ ఎంపికలో అధికారుల సీనియార్టీ, సామర్థ్యం విధేయత, పదవీకాలం వంటి అనేక అంశాలను ప్రభుత్వం బెరీజు వేసుకుంటుంది. కాగా.. సీనియర్ ఐఏఎస్ లు అరవింద్ కుమార్, వికాస్ రాజ్, జయష్ రంజన్, సంజయ్ జాజు పేర్లు సీఎస్ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 1992 బ్యాచ్ కు చెందిన ఈ నలుగురు కీలక అధికారుల్లో ఒకరిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.

సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు

తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి దాదాపు 20 నెలలు గడిచింది. అటు మంత్రివర్గ విస్తరణ కూడా దాదాపు జరిగిపోయింది. 6 గ్యారంటీల అమలులో బాలారిష్టాలను తొలగించుకొని ఒక్కొక్క హామీని నెమ్మదిగా అమలుపరుస్తున్నారు. అయినప్పటికీ ఇంకా అమలు కాని హామీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్ధతను ప్రశ్నిస్తున్నాయి. దీనికి తోడు పలు సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వాన్ని సతమతం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అధికార యంత్రాంగం సహకారం సంపూర్ణంగా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేయడం దాదాపు అసాధ్యం అలాంటి సంకట స్థితిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర నూతన చీఫ్ సెక్రటరీ ఎంపిక అత్యంత కీలకంగా మారింది. ఈ నియామకం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనా దక్షతకు, దార్శనికతకు నిదర్శనంగా నిలవనుంది.

సీనియారిటీ లెక్కలు:

సీనియారిటీ పరంగా చూస్తే, 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అర్వింద్ కుమార్ పేరు ముందు వరుసలో వినిపిస్తోంది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు తర్వాత అదే బ్యాచ్‌లో ఉన్న ఆయనకు సహజంగానే అవకాశం దక్కాలి. అయితే, ఆయన 2026 అక్టోబరులోనే పదవీ విరమణ చేయనున్నారు. అంటే, ఆయనను నియమిస్తే దాదాపు రెండేళ్లకే మళ్లీ కొత్త సీఎస్ కోసం వెతకాల్సిన పరిస్థితి వస్తుంది. తరచుగా సీఎస్ ను మార్చడం ప్రభుత్వ విధానాల కొనసాగింపునకు ఆటంకం కలిగిస్తుందనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేవలం సీనియారిటీకే కట్టుబడుతుందా లేక దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.

పోటీలో 1992 బ్యాచ్ అధికారులు:

ఈ సమీకరణాల నేపథ్యంలో 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారుల పేర్లు బలంగా తెరపైకి వస్తున్నాయి. ఈ బ్యాచ్‌లో జయేష్ రంజన్, సంజయ్ జాజు, వికాస్ రాజ్ వంటి ముగ్గురు సమర్థులైన అధికారులు ఉన్నారు. వీరిలో జయేష్ రంజన్ గతంలోనూ, ప్రస్తుత ప్రభుత్వాలలో తనదైన ముద్ర వేసి, కీలక శాఖలలో పనిచేస్తూ అందరికీ సుపరిచితులుగా ఉన్నారు. ఆయనకు 2027 సెప్టెంబర్ వరకు సర్వీసు ఉంది. ఇక గతంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన వికాస్ రాజ్‌కు 2028 మార్చి వరకు, అంటే అందరికన్నా ఎక్కువ సర్వీసు ఉంది. రాష్ట్ర పరిపాలనపై పూర్తి పట్టున్న వీరిద్దరూ కూడా బలమైన పోటీదారులుగా ఉన్నారు.

పిలిస్తే వస్తా అంటున్న సంజయ్ జాజు:
అయితే, ఈ పోటీలో సంజయ్ జాజు పేరు ఒక ప్రత్యేకమైన ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో, సీఎస్ క్యాడర్‌కు సమానమైన హోదాలో పనిచేస్తున్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తే తిరిగి తెలంగాణకు వచ్చి, మరో మూడున్నరేళ్ల పాటు పూర్తిస్థాయిలో సేవలందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. పదేళ్ల పాటు ఢిల్లీలో పనిచేసిన అనుభవంతో పాటు, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం సాధించడానికి ఆయనకున్న పట్టు రాష్ట్రానికి అదనపు బలంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు ఒకే అధికారి సీఎస్‌గా కొనసాగితే, ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయడానికి, పరిపాలనలో స్థిరత్వం తీసుకురావడానికి వీలుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యమంత్రి ముందున్న సవాళ్లు ఇవే:

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు అనేక ప్రశ్నలు ఉన్నాయి. కేవలం సీనియారిటీకే పట్టం కట్టి అర్వింద్ కుమార్‌కు అవకాశం ఇస్తారా? లేక రాష్ట్రంలో ఇప్పటికే తమ పనితీరు నిరూపించుకున్న జయేష్ రంజన్ లేదా వికాస్ రాజ్‌లలో ఒకరిని ఎంచుకుంటారా? వీటన్నింటికీ భిన్నంగా, దీర్ఘకాలిక స్థిరత్వం, కేంద్రంలో అనుభవం అనే అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి, పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్న సంజయ్ జాజుకు బాధ్యతలు అప్పగిస్తారా? అనేది తేలాల్సి ఉంది. ప్రభుత్వం చల్తీకా నామ్ గాడీ అన్నట్లు సర్దుకుపోతుందా లేక రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించే సాహసోపేత నిర్ణయం తీసుకుంటుందా అన్నది వేచి చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉద్రిక్తత కాకతీయ, హుజురాబాద్:...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..!

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..! జూబ్లీహిల్స్ ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి.. కాక‌తీయ‌, హైదరాబాద్ : జూబ్లీహిల్స్...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...

27 నుంచి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌

27 నుంచి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కాక‌తీయ‌, హైద‌రాబాద్ : గ్రీన్ ఇండియా...
spot_img

Popular Categories

spot_imgspot_img