epaper
Thursday, January 15, 2026
epaper

అల్లు అర్జున్ ఏ 11

అల్లు అర్జున్ ఏ 11

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో పోలీసుల ఛార్జిషీట్‌

ఏ 1గా థియేట‌ర్ యాజ‌మాన్యం

8మంది బ‌న్నీ వ్య‌క్తిగ‌త సిబ్బందిపైనా అభియోగాలు

మొత్తం 23 మందిపై ఛార్జిషీట్ దాఖ‌లు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు మోపారు. ఈ కేసు ఛార్జిషీట్​లో ఏ-11గా నటుడు అల్లు అర్జున్ పేరును చేర్చారు. అల్లు అర్జున్‌తో పాటు ఆయన మేనేజర్‌, సిబ్బంది సహా 8 మంది బౌన్సర్లపై అభియోగాలు నమోదు చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు నిర్థారించామని చిక్కడపల్లి ఏసీపీ రమేశ్‌ కుమార్‌ తెలిపారు.

అసలేం జరిగింది

2024 డిసెంబర్‌ 4న రాత్రి 9.30 గంటల టైంలో పుష్ప-2 బెనిఫిట్‌ షో కోసం హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్దకు వచ్చిన అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో రేవతి (35) అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ (9) కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. వీరిద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. తక్షణమే స్పందిచిన పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి సీపీఆర్‌ చేశారు. హుటాహుటిన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేవతి మృతి చెందారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉండటంతో నిమ్స్‌కు తరలించారు. పుష్ప-2 సినిమా చూసేందుకు మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు రాగా తల్లి కుమారుడు తొక్కిసలాటలో చిక్కుకున్నారు. వారిలో తల్లి మృత్యువాతపడటం విషాదాన్ని నింపింది. తొక్కిసలాటలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్​పై కూడా కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించగా, డిసెంబర్​ 27న రిమాండ్ ముగిసింది. అదే రోజు ఆయన వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. అప్పుడే ఆయన తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు. అల్లు అర్జున్​కు నాంపల్లి న్యాయస్థానం రెగ్యులర్​ బెయిల్​ను మంజూరు చేసింది. రెగ్యులర్​ బెయిల్​పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగియగా న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

షరతులతో కూడిన బెయిల్​

2025 జనవరి 3న అల్లు అర్జున్​కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్​ను మంజూరు చేసింది. ప్రతి ఆదివారం ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు రెండు నెలల పాటుగా ఛార్జిషీట్ దాఖలు చేసే వరకు చిక్కడపల్లి పోలీసుల విచారణకు అల్లు అర్జున్​ హాజరుకావాలని కోర్టు అదేశాలు జారీ చేసింది. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా అర్జున్ దేశం విడిచి వెళ్లకూడదని న్యాయస్థానం అదేశాలు జారీ చేసింది. ఒక్కొక్కరికి 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు తెలిపింది. దీంతో పాటు అల్లు అర్జున్ దర్యాప్తు చేస్తున్న పోలీసులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎటువంటి బెదిరింపులకు పాల్పడవద్దని కోర్టు సూచించింది. ఈకేసు సంబంధించిన సాక్షులను బెదిరించే ప్రయత్నం చేయవద్దని కోర్టు హెచ్చరించింది. అప్పుడు అల్లు అర్జున్​ అరెస్ట్, బెయిల్​పై విడుదలవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇదే ఘటనలో సంధ్య థియేటర్​ యాజమాన్యాన్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారంతా బెయిల్​పై బయటకు వచ్చారు.

ఇప్పటికీ చికిత్స పొందుతున్న శ్రీతేజ్మ

మ‌రోవైపు ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన శ్రీతేజ్ ఇప్పటికీ చికిత్స పొందుతూనే ఉన్నారు. ఈ ఘటన జరిగి సంవత్సరం అయిన సందర్భంగా ఈ నెల 4న భాస్కర్‌ కుటుంబానికి అందుతున్న సహాయం, శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితిని తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజు వివరించారు. భాస్కర్‌, ఆయన సోదరుడితో కలిసి మాట్లాడారు. ప్రస్తుతం శ్రీతేజ్‌ కోలుకుంటున్నాడని, బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు అల్లు అర్జున్‌ ముందుకు వచ్చి రూ.2 కోట్లు డిపాజిట్‌ చేశారని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img