కాకతీయ, అమరావతి: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు, ఎల్ఎన్ పేట, వజ్రపుకొత్తూరు, అముదాలవలస, కొత్తూరు, లావేరు, కంచిలి మండలాల్లో భారీ వర్షం పడుతోంది. నాగావళి, వంశధార, నదులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షం నేపథ్యంలో నేడు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. కలెక్టరే ట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్ తెలిపారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం మండలం చెన్నూరు వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయనగరం వస్తున్నా వెంకటరమణ ట్రావెల్స్ బస్సు వెనుక చక్రం డివైడర్ ఎక్కడంతో బోల్తా పడింది.
విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిలో 100 ఎకరాలు, విలాస కాన్నిపాలెం లోపాలు ఎకరాల్లో వరి పంట భారీ వర్షాలకు ముంపునకు గురైంది. ఈ కారణంగా విద్యార్థుల భద్రత ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు ఏ యు రిజిస్టర్ సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లను దారి మళ్లించారు. కొన్ని రైళ్ళను రద్దు చేశారు. మంగళవారం విశాఖపట్నం – కిరండోల్ పాసింజర్ రైలను రద్దు చేశారు.


