మృతురాలి కుటుంబానికి ఆర్థిక భరోసా
దహన సంస్కారాలకు రూ.5 వేల సాయం
ఎన్నికల హామీ అమలు చేసి చూపిన మర్రిపల్లి సర్పంచ్
కాకతీయ, దుగ్గొండి : మర్రిపల్లి గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన కకుక్కమూడి సారమ్మ పార్థివదేహానికి గ్రామ సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ నివాళులర్పించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కీ.శే. డ్యాగం మలహర్ రావు జ్ఞాపకార్థం మృతురాలి దహన సంస్కారాల కోసం రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని సర్పంచ్ డ్యాగం సుజాత, డ్యాగం ప్రతాప్‌లు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుజాత మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి కుటుంబానికి కష్టకాలంలో ఆర్థికంగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. గ్రామ ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కుంట రాజుకుమార్, ఉప సర్పంచ్ బోయిని రంజిత్, వార్డు సభ్యులు కుక్కమూడి రాజేందర్, కవిత, డ్యాగం రాణి నర్సింగం, డ్యాగం శివాజీ, అల్లాపురం ప్రదీప్, మాస మొగిలి, మైదం పద్మాకర్, కుక్కమూడి శ్రీను, మైదం దిలీప్, ధామ రాజు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


