epaper
Monday, March 2, 2026
epaper

ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీపై దిగ్విజ‌య్ ప్ర‌శంస‌లు

ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీపై దిగ్విజ‌య్ ప్ర‌శంస‌లు
మోదీ ఎదుగుదల ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్
రాహుల్ గాంధీకి అంతర్లీన సందేశమా?
బీజేపీకి అస్త్రంగా మారిన వ్యాఖ్యలు
క‌ల‌క‌లం రేపుతున్న దిగ్విజయ్ సింగ్ కామెంట్స్‌

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ తీవ్ర చర్చకు దారి తీశాయి. ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీ సంస్థాగత వ్యవస్థను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ ఎదుగుదలకు సంబంధించిన పాత ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా దిగ్విజయ్ సింగ్ కొత్త రాజకీయ దుమారాన్ని రేపారు. 1990ల నాటి ఫోటోలో అప్పటి బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ సమక్షంలో నేలపై కూర్చున్న యువ మోదీ కనిపిస్తారు. ఈ ఫోటోను ఉదాహరణగా చూపుతూ, ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీ వ్యవస్థలో గ్రాస్‌రూట్ కార్యకర్తలు రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధాని స్థాయికి ఎదగగలరని ప్రశంసించారు. “ఇది సంస్థ శక్తి” అంటూ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థపై ప్రశంసలు

“ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు, జనసంఘ్ కార్యకర్తలు నేలపై కూర్చునే స్థాయి నుంచి ముఖ్యమంత్రి, ప్రధాని స్థాయికి ఎదగడం ఆ సంస్థ బలాన్ని చూపిస్తుంది” అని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుండగా, పార్టీ అధిష్ఠానం మౌనంగా ఉంది. ఈ పోస్టులో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు కీలక నేతలను ట్యాగ్ చేయడం గమనార్హం. దీంతో ఇది పార్టీ అధిష్ఠానానికి ఉద్దేశించిన సంకేతమా అనే చర్చ మొదలైంది. దిగ్విజయ్ వ్యాఖ్యలను బీజేపీ తనకు అనుకూలంగా మలచుకుంది. బీజేపీ నేతలు స్పందిస్తూ, కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, కుటుంబ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. “దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ వాస్తవ స్వరూపాన్ని బయటపెట్టాయి” అంటూ విమర్శలు గుప్పించారు.

వివాదం ముదిరిన నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ స్పష్టీకరణ ఇచ్చారు. తాను సంస్థాగత బలాన్ని మాత్రమే ప్రశంసించానని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలకు తాను వ్యతిరేకమేనని తెలిపారు. అయినప్పటికీ, కాంగ్రెస్‌లో సంస్కరణల అవసరాన్ని గతంలో ప్రస్తావించిన దిగ్విజయ్ వ్యాఖ్యలు, పార్టీ అంతర్గత రాజకీయాలకు కొత్త మలుపు తిప్పినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యసభ పదవీకాలం ముగింపు సమీపిస్తున్న వేళ, ఈ వ్యాఖ్యలు ఆయన రాజకీయ భవిష్యత్తుపైనా ప్రభావం చూపే అవకాశముందని చర్చ సాగుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img