నట్టల నివారణ మందుల ఉచిత పంపిణీ
కాకతీయ, చెన్నారావుపేట : రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నట్టల నివారణ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని పదహారు చింతల తండ గ్రామంలో గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ విక్రమ్, ఉప సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నట్టల నివారణ మందులు వాడటం వల్ల గొర్రెలు, మేకల శరీరాల్లో ఉన్న పురుగులు నశించి, పశువుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఎదుగుదలకూ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పశు వైద్య అధికారి మంజిలాల్ మాట్లాడుతూ పశుపోషకులు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ ప్రజల తరఫున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు పశుసంవర్ధక శాఖ సిబ్బంది రఫీద్, యాకూబ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్టీ పర్పస్ పంతులు, చందా, పంతులు, నారాయణ్ సింగ్‌తో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


