ఘనంగా వేం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
కాకతీయ, నెల్లికుదురు : మండల కేంద్రం నెల్లికుదురులోని విశ్రాంతి భవనంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. సుమారు 500 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, వేం నరేందర్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, స్థానిక సర్పంచ్ పులి వెంకన్నతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు సత్యపాల్ రెడ్డి, యాదవ రెడ్డి, హెచ్. వెంకటేశ్వర్లు, లక్ష్మారెడ్డి, ఆకుతోట సతీష్, బాలాజీ, వలబోజు వెంకటేశ్వర్లు, హెచ్చు అలివేలు తదితరులు పాల్గొన్నారు. అలాగే వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


