భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ఏజీ
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని శుక్రవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఏ. సుదర్శన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన అడ్వకేట్ జనరల్‌కు దేవాలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం అమ్మవారి శేషవస్త్రాలు బహూకరించి మహాదాశీర్వచనం నిర్వహించి ప్రసాదాలు అందజేశామని ఆలయ ఈఓ రామల సునీత తెలిపారు. అనంతరం సౌత్ సెంట్రల్ రైల్వే సీసీఎం ఇతి పాండే కూడా అమ్మవారిని దర్శించుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మట్టేవాడా ఇన్స్పెక్టర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తాగునీరు, ప్రసాదాలు తదితర సౌకర్యాలను దేవస్థాన ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, బింగి సతీష్, అనంతుల శ్రీనివాస్ పర్యవేక్షించారు. శుక్రవారం కావడంతో పాటు వరుసగా సెలవులు రావడంతో భద్రకాళి దేవస్థానానికి భక్తులు భారీగా తరలివచ్చారు.



