కాకతీయ, బయ్యారం: గార్ల,డోర్నకల్, మరిపెడ మండలాలు మహబూబాబాద్ జిల్లా లో ఆదివారం జిల్లా (ఇన్చార్జి) కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, (రెవెన్యూ) అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్,జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం జిల్లాలో వరదల వలన సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ స్థాయి నుండి ప్రత్యేక అధికారులు, గ్రామస్థాయి సిబ్బంది వరకు క్షేత్రస్థాయిలోనే ఉంటూ స్థానిక పరిస్థితులను గమనిస్తూ ముందస్తు చర్యలు తీసుకొని సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం, మంత్రి ఆదేశించినందున ఆదివారం అందరూ వారికి కేటాయించిన ప్రదేశాలలో విధులలో ఉండాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ గార్ల మండలం రామాపురం లో లెవెల్ వంతెన, సీతంపేట పెద్ద చెరువు, లను సందర్శించి వరద పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రత్యేక అధికారి హరి ప్రసాద్, తహసిల్దార్, ఎంపీడీవోలకు సూచించారు. బయ్యారం మండలం, పెద్ద చెరువు, నామాలపాడు (లో లెవెల్ వంతెన) గార్ల, డోర్నకల్ మండలం ములకలపల్లి వంతెన, మరిపేడ పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి, ఎడ్చెర్ల, పెద్ద చెరువు, లను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
(18) మండలాల ప్రత్యేక అధికారులు మండల స్థాయి బృందం తో కలిసి చెరువులు, కుంటలు ,వాగులు, వంతెనలు, బ్రిడ్జిలు తదితర అన్ని సమస్యాత్మక ప్రాంతాలు తనిఖీ చేస్తూ, ఎప్పటికప్పుడు నివేదికలు అధికారులు సమర్పించడం జరుగుతుందని, సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలో రేపటి వరకు రెడ్ అలర్ట్ ఉన్నందున, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించినందున, అందరూ అప్రమత్తంగా ఉంటూ, తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు,
ఇప్పటికే జిల్లాలో విపత్తుల నివారణ సిబ్బంది, ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, బృందాలు సిద్ధంగా ఉన్నాయని, అధికారులు హెడ్ క్వార్టర్ మైంటైన్ చేస్తూ ఉన్నారని పూర్తిస్థాయిలో ప్రస్తుతానికి జిల్లా లో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవని కలెక్టర్ అన్నారు. ఈ పర్యటనలో మండల ప్రత్యేక అధికారులు శ్రీనివాసరావు, హరిప్రసాద్, డాక్టర్ కిరణ్ కుమార్, స్థానిక తహసీల్దారులు నాగరాజు, కృష్ణ వేణి,శారద, ఎంపీడీవోలు, సంబంధిత ఇరిగేషన్ ఆర్ అండ్ బి సిబ్బంది, పోలీస్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


