ఆడపడుచుల ఆత్మీయ బంధానికి వేదిక
చిన్ననాగారంలో వినూత్న కుటుంబ సమ్మేళనం
మేనత్త–మేనకోడళ్ల కలయికతో పండుగ వాతావరణం
వాయనాలు, పట్టు చీరలతో పరస్పర గౌరవం
గ్రామస్తులను ఆకట్టుకున్న ఆచారం
కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారం గ్రామంలో ఆడపడుచుల మధ్య ఆత్మీయ బంధాన్ని మరింత బలపరిచేలా వినూత్న సమ్మేళనం గురువారం ఘనంగా జరిగింది. కొయ్యడి వంశానికి చెందిన మేనత్తలు, మేనకోడళ్లు ఒకే వేదికపై కలుసుకుని సంబరాలు నిర్వహించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, కుటుంబ బంధాల ప్రాధాన్యతను చాటుతూ ఈ సమ్మేళనం గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మేనత్తలు–మేనకోడళ్ల మధ్య వాయనాలు ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు పట్టు చీరలు బహూకరించారు. పరస్పర గౌరవం, ప్రేమాభిమానాలకు ప్రతీకగా ఈ కార్యక్రమం నిలిచిందని పాల్గొన్న వారు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని వీక్షించిన గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు కుటుంబ సభ్యులను మరింత దగ్గర చేస్తాయని, ప్రతి ఆడపడుచు ఇలాంటి కార్యక్రమాలపై ఆలోచన చేయాలని వారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో ముందుండి పెద్దరికంగా వ్యవహరించిన బైరు సరోజనను ప్రత్యేకంగా శాలువాతో ఘనంగా సన్మానించారు.


