బాలకృష్ణ కుటుంబానికి నవీన్ రావు పరామర్శ
కాకతీయ, మరిపెడ : మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో నివసిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ దాస రోజు బాలకృష్ణ సతీమణి సరిత ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు గురువారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనారోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్న నవీన్ రావు, సరిత ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు ఇచ్చిన సూచనలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పూర్తిస్థాయిలో వైద్య చికిత్స అందించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహాలను పాటించాలని సూచించారు. అవసరమైతే మరింత మెరుగైన ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలని కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనారోగ్య చికిత్సకు తోడ్పడేలా నవీన్ రావు తనవంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జర్నలిస్టులు సమాజానికి సేవలందించే వారని, కష్టకాలంలో వారికి అండగా ఉండాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు.


