లింగస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ పింగళి
కాకతీయ, తుంగతుర్తి : తుంగతుర్తి పట్టణంలోని శ్రీ స్వయంభు మహాదేవ లింగస్వామి దేవాలయాన్ని ఎమ్మెల్సీ పింగళి శ్రీపాదరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకం, పాలాభిషేకం, నైవేద్యాలు నిర్వహించి శివునికి మొక్కు తీర్చుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో ఇదే దేవాలయాన్ని దర్శించుకుని శివుని ఆశీస్సులు కోరుకున్నానని తెలిపారు. ఆ పరమేశ్వరుడి కృపతోనే ప్రజలు తనను గెలిపించారని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
కార్యక్రమంలో శివాలయ అర్చకులు, పండితులు ఎర్ర హరికిషన్ స్వామి, పలువురు శివ స్వాములు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


