బాధిత కుటుంబానికి పరామర్శ
కాకతీయ, గీసుగొండ : ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన మృతురాలి కుటుంబానికి ఐక్యవేదిక సభ్యులు పరామర్శించారు. మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలో అనారోగ్య కారణాలతో ఇటీవల మృతిచెందిన డక్క యాకమ్మ కుటుంబాన్ని ఐక్య వేదిక సభ్యులు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు 75 కిలోల బియ్యాన్ని ఐక్య వేదిక కన్వీనర్ కొత్తగట్టు రాజేందర్, బోనాల అశోక్, బోనాల కుమార్ తమవంతు సహాయంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో పెద్దమ్మగడ్డ పేర్ల వాసు,కొత్తగట్టు శివ, చిన్నపెల్లి భాస్కర్, ఐక్య వేదిక కో-కన్వీనర్ డక్క రాజగోపాల్, చిన్నపెల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


