కాకతీయ, నర్సింహులపేట: కొన్ని రోజుల నుండి వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు 50 వేల రూపాయల విలువ గల రెండు సెల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేసి సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు ఆదివారం ఎస్సై సురేష్ అందజేశారు.
అనంతరం ఎస్సై మాట్లాడుతూ సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కలిగించడానికి డిఓటి,సీఈఐఆర్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. సెల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సీ ఈఐఆర్ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలని,మొబైల్ ను బ్లాక్ చేసి మీసేవ ద్వారా దరఖాస్తు సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు.పోయిన మొబైల్ ఫోన్లు మళ్ళీ మళ్లీ దొరకవు అనుకున్న బాధితులు పోలీస్ టెక్నాలజీ ఉపయోగించి ఫోన్లు రికవర్ చేసి అందజేసినందుకు సంబంధిత బాధితులు ఎస్సై సురేష్ మరియు పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.


