పిన్నవారి వీధి రోడ్డుకు వార్షికోత్సవం
కాలనీవాసుల సంబరాలు – కార్పొరేటర్‌కు సన్మానం
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ నగరంలోని పిన్నవారి వీధిలో నిర్మించిన రోడ్డు పూర్తిై ఒక సంవత్సరం కావడంతో బుధవారం 28వ డివిజన్ కాలనీవాసులు, వ్యాపారస్తులు ఆనందోత్సాహాలతో వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన నవీన్‌తో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా సన్మానించారు. నాణ్యమైన రోడ్డును నిర్మించి ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించినందుకు కార్పొరేటర్‌కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు వేసినప్పటి నుంచి వర్షకాలంలో కూడా ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో చకిలం సతీష్, పిన్న నారాయణ, శ్రీమాత శ్రీను, సత్యనారాయణ పాండే, పోకల రాము, మహారాజ్ శివకుమార్, కేదాశి కిరణ్, చకిలం మేకాంబరం, జి. సంతోష్, ఆర్. రాజు, కె. కళ్యాణ్, భార్గవరామ్, బాదం వెంకటేశ్వర్లు, రాజేశ్వరరావు, తోట కేదారి తదితరులు పాల్గొన్నారు.


